News July 19, 2024
పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఏమున్నాయంటే?

పూరీ రత్నభాండాగారంలో పాములు లేవని అధికారులు తెలిపారు. నిన్న రహస్య గదిని తెరిచి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ‘సీక్రెట్ రూమ్‌లో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలు(2చెక్కవి, 1 స్టీల్), 4 అల్మారాలు(3 చెక్కవి, ఒకటి స్టీల్) ఉన్నాయి. వాటిలో ఆభరణాలున్నాయి. వాటి వివరాలను బయటకు చెప్పలేం. స్వామి వారి సంపద చెక్కుచెదరలేదు. రహస్య గది నుంచి సొరంగమార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్‌ను కాకుండా వీడియో సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.
News November 7, 2025
నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

*1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
*1888: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి, భారత రత్న గ్రహీత సి.వి.రామన్(ఫొటోలో) జననం
*1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్‌జీ రంగా జననం
*1954: నటుడు కమల్ హాసన్ జననం
*1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
*1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే
*జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
News November 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


