News July 19, 2024
ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వివిధ గ్రామాల్లో 100కు పైగా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోగులు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు సూచిస్తున్నారు.
Similar News
News August 26, 2025
ADB: దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
News August 26, 2025
రాష్ట్ర బాలల కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన జిల్లా హెచ్‌ఆర్సీ ఛైర్మన్

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీత దయాకర్‌రెడ్డిని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాలల పరిరక్షణ, దత్తత, విద్య, ఎన్‌జీవోల పాత్ర వంటి వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.
News August 26, 2025
ADB: మట్టి గణపతులను పంపిణీ చేసిన కలెక్టర్

పర్యావరణాన్ని రక్షించేందుకు, నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే హానిని నివారించేందుకు మట్టి గణపతులు దోహదపడుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. 2,000 ఎస్‌హెచ్‌జి గ్రూపులకు, 1,000 మెప్మా ఆర్‌పీలకూ మట్టి విగ్రహాలను అందజేశారు.