News July 19, 2024

నిజామాబాద్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు వెల్లడించారు. వివరాలిలా.. ఆలూరు(M)కు చెందిన గంగుకు తన కోడలితో గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని వెంకటి అనే వ్యక్తికి చెప్పడంతో అతడు నగలు దోచుకోవాలనే దురుద్దేశ పడ్డాడు. గొడవ పడకుండా ఉండేందుకు పూజలు చేయాలని చెప్పాడు. 2022 SEP 27న ఓ మడుగులో స్నానం చేయాలని చెప్పాడు. ఆమె నీటిలో దిగగానే మెడకు చీర చుట్టి చంపేశాడు.

Similar News

News August 26, 2025

NZB: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

image

గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్‌లో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం రాత్రి పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ముఖ్యమైన గణేశ్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.

News August 26, 2025

NZB: మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంపూర్ణ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

News August 26, 2025

NZB: CP ఎదుట 28 మంది బైండోవర్

image

గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.