News July 19, 2024

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Similar News

News January 24, 2025

TDS రాజ్యాంగవిరుద్ధం: పిల్ తిరస్కరించిన CJI

image

TDSను నిరంకుశం, నిర్హేతుకం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలన్న పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘సారీ, మేం దీన్ని విచారించలేం. పిల్‌ను ఘోరంగా డ్రాఫ్ట్ చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లొచ్చు. దీనిని మేం తిరస్కరిస్తున్నాం’ అని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. TDS సమానత్వ హక్కును హరించేస్తోందని, గుదిబండగా మారిందని BJP నేత, లాయర్ అశ్విని కుమార్ పిల్ దాఖలు చేశారు.

News January 24, 2025

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ

image

AP: అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం’ అని చెప్పారు.

News January 24, 2025

SHOCKING: అల్ట్రా HDలో ‘గేమ్ ఛేంజర్’ లీక్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.