News July 19, 2024
వరంగల్: నేడు భారీ వర్షం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. MHBD, MLG జిల్లాలకు రెడ్ అలర్ట్, HNK, WGL, BHPL ఆరెంజ్, జనగామకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్ నంబరు 97019 99645 సంప్రదించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ప్రకటనలో కోరారు.
Similar News
News August 26, 2025
ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్

ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీతో పాటు ఇతర విభాగాల్లో అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైద్య సిబ్బందితో చర్చించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News August 26, 2025
మార్కెట్‌లో తగ్గిన చిరుధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,365 ధర రాగా, నేడు రూ. 2,335 వచ్చింది. అలాగే సూక పల్లికాయకి నిన్న రూ.6,200 ధర వస్తే.. నేడు రూ.6,050 పలికింది. పచ్చి పల్లికాయ సోమవారం రూ.3,500 ధర పలకగా.. ఈరోజు రూ. 3,300కి తగ్గింది. పసుపు క్వింటాకు రూ.10,808 ధర వచ్చింది.
News August 26, 2025
ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.