News July 19, 2024

గుంటూరు: రద్దు చేసిన రైళ్లను 21 నుంచి పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసిన రైళ్లను 21వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు-డోన్ (17228), నర్సపూర్-గుంటూరు (17282)రైళ్లను ఈనెల 21వ నుంచి, డోన్-గుంటూరు (17227), గుంటూరు-నర్సపూర్ (17281) రైళ్లు ఈ నెల 22వ తేదీ నుంచి పాత సమయాల ప్రకారం యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. 

Similar News

News January 14, 2026

రాజధాని పనులు వేగంగా చేయాలి: కలెక్టర్

image

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

News January 13, 2026

తెనాలి: వీడుతున్న హత్య కేసు మిస్టరీ..!

image

తెనాలి టీచర్స్ కాలనీలో జరిగిన షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యకేసు మిస్టరీ వీడుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫయాజ్ సహజీవనం చేస్తున్న ఓ మహిళ సహా హత్యకు పాల్పడిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన మహిళ ముత్యంశెట్టిపాలెంకి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఫయాజ్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది.