News July 19, 2024
విశాఖ: పిల్లలను బెదిరించే ప్రయత్నంలో తండ్రి మృతి

‘మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం ఆతని ప్రాణాలనే తీసింది. ఈ ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన చందన్ కుమార్(33) పిల్లలు డబ్బులు చించేయడంతో వారిపై కోప్పడగా భార్య అడ్డు పడింది. దీంతో చందన్ ఫ్యాన్‌కు చీరకట్టి పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అదికాస్తా బిగుసుకుపోయి అతని ప్రాణాలు తీసింది.
Similar News
News July 6, 2025
గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.
News July 6, 2025
విశాఖలో రేపు P.G.R.S.

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.
News July 6, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.