News July 19, 2024

మెదక్: యాసిడ్ తాగి వ్యక్తి మృతి

image

అప్పులు తీర్చలేక ఓ వక్తి యాసిడ్ తాగాడు. ఈ ఘటన తూప్రాన్‌లో జరిగింది. ఎస్సై శివానందం వివరాలు.. పట్టణానికి చెందిన నరసింహచారి(40) నాలుగేళ్ల క్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. బ్యాంకులో రూ.17లక్షలు, ఇతరుల వద్ద రూ.6లక్షలు అప్పు చేశాడు. డబ్బు చెల్లించే పరిస్థితి లేక తన దుకాణంలో బంగారం కరిగించేందుకు ఉపయోగించే యాసిడ్ సేవించాడు. పక్కనే ఉన్న దుకాణదారుడు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News August 26, 2025

మెదక్ జిల్లాకు వర్ష సూచన.. కలెక్టర్ అల్టర్

image

జిల్లాలో రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంతెనలు, వాగులు, చెరువులు, నీటి మునిగే ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించారు.

News August 25, 2025

మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

image

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2025

కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.