News July 19, 2024

భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన గోదావరి

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News January 12, 2026

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

image

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

News January 12, 2026

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

image

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News January 12, 2026

వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.