News July 19, 2024

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

image

ప్రస్తుతం తుఫాను వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి, ఏలూరు సహా కోస్తాంధ్రలోని పలు జిల్లాల కలెక్టర్‌లతో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.

News September 16, 2025

విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.