News July 19, 2024

జన్నారం: ‘నాకు రుణమాఫీ కాలేదు’

image

జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన చిందం రాజమౌళి అనే రైతుకు ఇందంపల్లి గ్రామీణ బ్యాంకులో రూ.45 వేల అప్పు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసిన లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రెస్ కార్యాలయానికి వచ్చి మీడియాకు తన గోడును వినిపించాడు. అర్హతలు ఉన్నప్పటికీ మాఫీ కాలేదన్నారు.

Similar News

News August 26, 2025

ADB: నేవీ ఉద్యోగం సాధించిన కామర్స్ విద్యార్థి

image

ADB ప్రభుత్వ ఆర్ట్స్‌, కామర్స్‌ డిగ్రీ కళాశాలలో BA రెండో సంవత్సరం చదువుతున్న కుమ్ర శశికాంత్‌ నేవీలో ఉద్యోగం సాధించాడు. సోమవారం కళాశాలలో శశికాంత్‌ను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అతిక్‌ బేగం ఘనంగా సన్మానించారు. దేశ సరిహద్దుల్లో సేవ చేయడానికి తమ కళాశాల విద్యార్థి వెళ్లడం గర్వకారణమని అభినందనలు తెలిపారు.

News August 26, 2025

ADB: హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించాలి: కలెక్టర్

image

భారీ వర్షాలకు ఆదిలాబాద్ అర్బన్‌లో జలమయమైన లోలెవల్ బ్రిడ్జిలు.. హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా సోమవారం సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి శాశ్వత పరిష్కార మార్గంపై చర్చించారు.

News August 25, 2025

95 గంజాయి మొక్కలు స్వాధీనం: ADB ఎస్పీ

image

గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దడం పోలీసులు ప్రధాన లక్ష్యం అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నార్నూర్ మండలం సుంగాపూర్‌లో గంజాయి పండిస్తున్నారని సమాచారం మేరకు సీసీఎస్, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ భూమిలో 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి పండించిన కొడప దేవురావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.