News July 19, 2024

HYD: వ్యభిచారం.. జూనియర్ ఆర్టిస్ట్ ARREST

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని HYD జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ NTR నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో SOT ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు మరో మహిళ, శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 9, 2026

రీల్స్ వైరలా కావాలా? జూబ్లీహిల్స్ వచ్చేయండి!

image

మీరు తీసే ట్రావెల్ వీడియోలు వైరల్ అవ్వడం లేదని ఫీలవుతున్నారా? FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో JAN 17న జూబ్లీహిల్స్‌లోని ‘క్రియేటర్ వర్స్’లో రీల్ మేకింగ్ బూట్‌క్యాంప్ జరుగుతోంది. ₹500లకే షూటింగ్, ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు. అద్భుతమైన రీల్స్ చేసి ₹50,000 నగదు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ మీ సొంతం. మీ స్మార్ట్‌ఫోన్ తీయండి, క్రియేటర్ అయిపోండి! మరిన్ని వివరాలకు 98480 42020లో సంప్రదించండి.

News January 9, 2026

మూసీ ప్రాజెక్ట్‌కు 200 ఎకరాల అదనపు సేకరణ

image

​మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లోని సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్‌ను, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని ఓ అధికారులు Way2News కు తెలిపారు.

News January 9, 2026

HYD: రాహుల్ సిప్లిగంజ్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

image

రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ‘కల్ట్’ వెబ్ సిరీస్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి చిన్నారుల హత్య కేసు ఆధారంగా తప్పుడు కథతో వెబ్ సిరీస్ నిర్మించి ఈ నెల 17న విడుదలకు ప్రయత్నించడం సరికాదని పిటిషనర్ ఉత్తం వల్లూరి చౌదరి తెలిపారు. ఇది తమ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేసును అడ్వకేట్ రామారావు ఇమ్మానేని వాదిస్తున్నారు.