News July 19, 2024

మిర్యాలగూడ బాలుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం

image

మిర్యాలగూడకు చెందిన ఓరుగంటి పవన్ కుమార్, రూప రేణుక దంపతుల కుమారుడు ఓరుగంటి రేయాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. రేయాన్ష్ పలు దేశాలు, జంతువులు, పక్షులు, గ్రహాల పేర్లు, జనరల్ నాలెడ్జ్, జాతీయ చిహ్నాల పేర్లను 15 నిమిషాల్లో 150కు పైగా చెప్పాడు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ లభించింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రేయాన్ష్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు.

Similar News

News August 26, 2025

MGUలో బి ఫార్మసీ, లా, బిఈడి కళాశాలలు!!

image

నల్గొండ MGUలో కొత్తగా ఫార్మసీ, లా, ఎడ్యుకేషన్ కళాశాలలను నెలకొల్పనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది. ఈ వర్సిటీ పరిధిలో బీఫార్మసీ, లా, బీఈడీ కళాశాలలు ఉండటం.. వాటిని పర్యవేక్షించేందుకు MGUలో అందుకు సంబంధించిన కళాశాలలు లేక పోవడంతో నిపుణుల కోసం ఇతర వర్సిటీలపై ఆధారపడాల్సి వస్తోంది. కళాశాలల మంజూరుపై వాడపల్లి నవీన్ హర్ష వ్యక్తం చేశారు.

News August 26, 2025

NLG: జిల్లాలో పదోన్నతుల కోలాహలం

image

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో 37 SAలకు జిహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా SGTలకు LFL హెచ్ఎంలుగా, SAలుగా168 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

News August 26, 2025

NLG: అర్ధాకలితోనే కళాశాలకు.. విద్యార్థుల అవస్థలు!

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం ఇస్తామన్న ప్రభుత్వ హామీ మాటగానే మిగిలిపోయింది. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ మంది పేద కుటుంబాల విద్యార్థులే ఉన్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేక చాలా మంది విద్యార్థులు రోజంతా పస్తులతో ఉంటున్నారు.