News July 19, 2024

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా చాట్ లీక్?

image

హీరోయిన్ రాజ్ తరుణ్, లావణ్య <<13601061>>కేసు<<>>లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ వాట్సాప్ చాట్ ఇదేనంటూ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ స్క్రీన్ షాట్స్‌ను లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జత చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News January 23, 2025

పెద్దపల్లి- రంగాపూర్ ప్రధాన రహదారి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు

image

పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామం వద్ద ప్రధాన రహదారికి అనుకుని ఉన్న చెట్టును కారు ఢీ కొట్టింది. అయితే ప్రమాదం ఎప్పుడూ జరిగింది. అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలియలేదు. కారులో ఉన్న వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు, తలకు గాయాలయయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2025

భారీగా పెరిగిన ధరలు.. కేజీ రూ.450

image

AP: నాన్‌వెజ్ వంటలు ఘాటుగా ఉండాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో KG ధర ₹450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి కారణమంటున్నారు. గూడెం నుంచే గోదావరి, విశాఖ, VZM, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది.

News January 23, 2025

అనిల్ రావిపూడి @100% స్ట్రైక్ రేట్‌

image

డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నట్లు SVC ట్వీట్ చేసింది. ‘దశాబ్దకాలంగా బ్లాక్ బస్టర్స్ అందిస్తూ, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోన్న హిట్ మెషీన్ అనిల్‌కు అభినందనలు. డబుల్ హ్యాట్రిక్ సాధించడంలో మీతో భాగమైనందుకు గర్విస్తున్నాం’ అని తెలిపింది. అనిల్ తన కెరీర్‌లో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు.