News July 19, 2024

T-సిరీస్ ప్రొడ్యూసర్ కూతురు మృతి

image

నటుడు, T-సిరీస్ ప్రొడ్యూసర్ క్రిషణ్ కుమార్ కుమార్తె తిశా(20) మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె జర్మనీలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు T-సిరీస్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. చాలాకాలం నుంచి తిశా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో యానిమల్ ప్రీమియర్ తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు.

Similar News

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

image

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్‌(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.

News March 22, 2026

కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

image

కేరళంలోని కోళికోడ్‌ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్‌ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.