News July 19, 2024
యువతిపై ‘జిందాల్ స్టీల్’ సీఈవో వేధింపులు!
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనని వేధించారని ఓ యువతి Xలో సంస్థ ఛైర్మన్ నవీన్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ‘కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తుండగా ఫ్లైట్‌లో నా పక్కన దినేశ్ కూర్చున్నారు. మాటలు కలిపి అతని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూపించారు. భయంతో స్టాఫ్‌కి ఫిర్యాదు చేశా. ఎయిర్పోర్ట్ పోలీసుల ముందు ఆయన ఇది అబద్ధమనలేదు’ అని ట్వీట్ చేశారు. నవీన్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Similar News
News January 23, 2025
అనిల్ రావిపూడి @100% స్ట్రైక్ రేట్
డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నట్లు SVC ట్వీట్ చేసింది. ‘దశాబ్దకాలంగా బ్లాక్ బస్టర్స్ అందిస్తూ, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోన్న హిట్ మెషీన్ అనిల్‌కు అభినందనలు. డబుల్ హ్యాట్రిక్ సాధించడంలో మీతో భాగమైనందుకు గర్విస్తున్నాం’ అని తెలిపింది. అనిల్ తన కెరీర్‌లో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు.
News January 23, 2025
మెట్రోలో ఇన్ని వస్తువులు మర్చిపోయారా?
అసాంఘిక కార్యకలాపాలతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రో రైలులో గతేడాది కోట్ల రూపాయల వస్తువులను విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. రైలులో & స్టేషన్ ఏరియాలోని ఎక్స్ రే లగేజీ స్కానర్ వద్ద మర్చిపోయిన వాటిల్లో రూ.40 లక్షలకు పైగా నగదు, 89 ల్యాప్‌టాప్స్, 193 మొబైల్స్‌తో పాటు 9 మంగళసూత్రాలు, వెండి ఆభరణాలు, ఉంగరాలున్నాయి. అయితే, CISF సిబ్బంది ద్వారా వీటి యజమానులను గుర్తించినట్లు వెల్లడించారు.
News January 23, 2025
దశాబ్దాల తర్వాత బంగ్లాకు ISI చీఫ్.. టార్గెట్ భారత్!
ISI చీఫ్ LT GEN ఆసిమ్ మాలిక్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడికి రావడం గమనార్హం. మంగళవారం దుబాయ్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన్ను బంగ్లా ఆర్మీ QMG LT GEN మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్ రిసీవ్ చేసుకున్నారు. రెహ్మాన్‌కు పాకిస్థాన్, ఇస్లామిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. తూర్పు సరిహద్దు వద్ద భారత్‌ను ఇబ్బంది పెట్టడమే ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తోంది.