News July 19, 2024
ఖమ్మం: జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి

జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
Similar News
News August 26, 2025
ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా..!

ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 113 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నెల 1 నుంచి 24వ తేదీ వరకు మొత్తం 82 కేసులు వెలుగు చూశాయి. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాచి వడబోసిన నీరు, వేడి పదార్థాలు, పండ్లు తీసుకోవడమే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News August 26, 2025
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం: DMHO

జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మల్టిజోన్-1లో MBBSపూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుDMHO కళావతిబాయి తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్‌లో సబ్మిట్ చేసి ఆ తర్వాత పూర్తి వివరాలతో ఆఫ్‌లైన్ దరఖాస్తు ఆఫీస్‌లో ఇవ్వాలని తెలిపారు.
ఈనెల 30లోపు అందజేయాలని సూచించారు.
News August 26, 2025
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఆగస్టు 30 వరకు గడువు

ఖమ్మం జలజ టౌన్‌షిప్‌లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తిగల ఉద్యోగులు ఆగస్టు 30లోపు రూ. 2 లక్షలు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 8 టవర్లలోని 576 ఫ్లాట్లు ఉన్నాయి. చదరపు గజానికి రూ.1,150 ధరగా నిర్ణయించారు. లాటరీని సెప్టెంబర్ 8న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.