News July 19, 2024
ములుగు: గోదావరిలో ఒకరు గల్లంతు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల ప్రకారం.. వెంకటాపురం పరిధిలోని అలుబాక గ్రామ సమీపంలోని గోదావరిలో శుక్రవారం మధ్యాహ్నం బానారి రాజు( 45) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గల్లంతయిన రాజు కోసం నాటు పడవ ద్వారా గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 16, 2025
రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండండి: వరంగల్ కలెక్టర్

ఈ నెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లపై ప్రజలను అప్రమత్తం చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
News August 16, 2025
వరంగల్ జిల్లాలో 40 మి.మీ వర్షపాతం నమోదు

వరంగల్ జిల్లాలో గత 24 గంటలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 40.0 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 114.8 మి.మీ, దుగ్గొండిలో 99.5 మి.మీ, నర్సంపేటలో 61.8 మి.మీ, సంగెంలో తక్కువగా 12.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News August 15, 2025
వరంగల్ జిల్లా వర్షపాతం వివరాలు

జిల్లాలో సగటు 18.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖానాపూర్ మండలంలో 76.8 మి.మీ వర్షం కురిసింది. వర్ధన్నపేటలో 41.5 మి.మీ, పర్వతగిరి 30.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, రాయపర్తి, నెక్కొండ మండలాల్లో 20 మి.మీ.కు పైగా వాన పడింది. జిల్లా మొత్తం వర్షపాతం 238.2 మి.మీ.గా నమోదైంది. కొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి.