News July 19, 2024

ఈనెల 21న పుట్టపర్తికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాక

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి ఈనెల 21న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలను సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 21న ఉదయం బెంగళూరు నుంచి రహదారి మార్గం గుండా పుట్టపర్తికి చేరుకుంటారు. గురుపౌర్ణమి వేడుకల అనంతరం తిరిగి వెళ్తారు.

Similar News

News November 10, 2025

కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.

News November 10, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.

News November 10, 2025

రైల్వే డీఆర్ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

image

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం డివిజన్‌లో అభివృద్ధి పనులపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమయ్యారు. అనంతరం రైల్వే డివిజన్‌లో రైల్వే స్టాపింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు మొదలైన అంశాలపై చర్చించారు.