News July 19, 2024

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 738 పాయింట్లు నష్టపోయి 80,604, నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయి 24,530 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్య్లూ స్టీల్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటామోటార్స్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, విప్రో, అపోలో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా.. ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.

Similar News

News July 6, 2025

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

image

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.

News July 6, 2025

PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

image

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.