News July 19, 2024
ప్రపంచమంతా ఇబ్బందులు.. రష్యాలో మాత్రం!!

మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఎర్రర్ వల్ల చాలా దేశాల్లో బ్యాంకింగ్, విమానయాన, హాస్పిటల్ సేవలు నిలిచిపోయాయి. అయితే రష్యాలో మాత్రం ఈ సర్వీసులకు ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. దీనికి కారణం రష్యాపై మైక్రోసాఫ్ట్ బ్యాన్ విధించడమే. ఉక్రెయిన్ విషయంలో EU ఆంక్షలు విధించడంతో రష్యన్ కంపెనీలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు 2022లో నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో మైక్రోసాఫ్ట్ OS వాడట్లేదు. Astra Linux ఓఎస్ వాడుతున్నట్లు సమాచారం.
Similar News
News January 2, 2026
విజయవాడ పుస్తకాల పండుగ నేటి నుంచే

AP: 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇందుకోసం ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 280-300 స్టాళ్లలో వేల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.
News January 2, 2026
చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.
News January 2, 2026
నేటి సామెత: కంచె వేసినదే కమతము

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.


