News July 19, 2024

మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి!

image

ప్రతిసారిలాగే ఈ సారి కూడా టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అవకాశమిచ్చిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం మొండిచేయి చూపారు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ చేశారు. అయినా ఆయనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దూబే లేదా పరాగ్‌లలో ఎవరో ఒకరి స్థానంలో సంజూకు చోటివ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News March 2, 2026

BREAKING: తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,290 తగ్గి ₹1,69,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹3,000 తగ్గి ₹1,55,650 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News March 2, 2026

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.

News March 2, 2026

హైదరాబాద్ చేరుకున్న రాహుల్

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వీరిద్దరూ కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరికి చేరుకోనున్నారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రానున్నారు.