News July 19, 2024
రషీద్ మృతిపై అంబటి ఏమన్నారంటే.!
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాలపై కచ్చితంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారన్నారు. వారిద్దరూ YCP కార్యకర్తలేనా అని మీడియా అడగ్గా.. ఇవన్నీ పిచ్చిమాటలని వినుకొండలో అందరికీ తెలిసిన విషయమేనని, హత్య చేసిన వ్యక్తి TDPలోనే ఉన్నాడని, మొన్న ఆ పార్టీ గెలుపుకై పోరాడిన విషయం తెలిసిందేనన్నారు.
Similar News
News November 5, 2024
తుళ్లూరు: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్ నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా కేవీ సబ్ స్టేషన్‌ను జీఐఎస్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్కో ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
News November 5, 2024
గుంటూరు: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కి దరఖాస్తులు ఆహ్వానం
APSRTCలో అప్రెంటిస్ షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.రవికాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apsrtc.ap.gov.in లో చూడాలని చెప్పారు.
News November 5, 2024
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం డ్రోన్ ఐటీ, సెమీకండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేసి, తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు