News July 19, 2024
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు: ఎస్పీ

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News October 24, 2025
తీగల వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

తీగల వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలన్నారు.
News October 24, 2025
ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన మైనార్టీలకు వివిధ రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ తెలిపారు. ప్రభుత్వ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో (ఎన్ఎస్డీసీ) అనుబంధం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల శిక్షణా సంస్థలు నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News October 24, 2025
15 రోజుల్లో దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించి, తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


