News July 19, 2024
పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

అధిక వర్షాల వలన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్‌లోకి వరద నీరు ప్రవేశిస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు పరిసర ప్రాంతాలలో గల కృష్ణా నది ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వరద నీరు అధికంగా వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Similar News
News November 8, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News November 7, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.


