News July 19, 2024

OFFICIAL: గ్రూప్-2 పరీక్షలు వాయిదా

image

TG: గ్రూప్-2 పరీక్షల వాయిదాపై TGPSC అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ DECలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తేదీలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉండటంతో నిరుద్యోగులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన భట్టి.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేశారు.

Similar News

News August 31, 2025

ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

image

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.

News August 31, 2025

అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

image

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.

News August 31, 2025

రేపు రాజంపేటలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.