News July 19, 2024
సికింద్రాబాద్ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం

HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్ బోనాలకు వచ్చే కేసీఆర్, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
Similar News
News August 25, 2025
ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ: సీఎం

ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలలు లాంటివని.. పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చిన ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయేనని తెలిపారు.
News August 25, 2025
HYDలో వినిపిస్తున్న మాట ‘అన్నా.. గణేశ్ చందా’

మరో 2 రోజుల్లో వినాయకచవితి రానుంది. ఈ నేపథ్యంలో వీధుల్లో ఎత్తైన గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువకులు సన్నాహాలు చేస్తున్నారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజారిని నియమించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. యువకులు, పిల్లలు ‘అన్నా.. అక్కా చందా ప్లీజ్’ అంటూ ఇళ్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు కొంత మంది యువత వినూత్నంగా డప్పులతో చందా అడుగుతున్నారు.
News August 24, 2025
పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను పూజించాలి: కొండా సురేఖ

పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణహిత గణేశ్ విగ్రహాల ప్రచార పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. 3,24,000 పర్యావరణహిత విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాష్ట్ర ఛైర్మన్ ఆనంద్ రావు, జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు.