News July 19, 2024
గిరి ప్రదక్షిణపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

గిరి ప్రదక్షిణపై విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 20వ తేదీ ఉదయం గిరిప్రదక్షిణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రికి ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 18, 2026
విశాఖ: 17 రోజుల్లో రూ.120 కోట్ల మద్యం తాగేశారు

విశాఖలో ఈనెల మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖ పరిధిలో 280 మద్యం దుకాణాల ద్వారా 1,52,000 లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 81000 బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కంటే ఐదు శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.
News January 18, 2026
బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన నేతలు

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News January 18, 2026
విశాఖ పోర్టుకు మరో రికార్డు

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.


