News July 19, 2024
నిరూపిస్తే.. బండి సంజయ్ రాజీనామా చేస్తారా?: మంత్రి పొన్నం

బండి సంజయ్ వ్యవహారశైలి చూస్తుంటే గురివిందగింజ నలుపెరుగదనే సామెత గుర్తొస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 70% మంది రైతులకు రుణమాఫీ వర్తించట్లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తక్షణమే సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News August 25, 2025
దివ్యాంగుల భవిత కేంద్రాన్ని సందర్శించిన KNR కలెక్టర్

మానకొండూర్‌లోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెలలో బోధిస్తున్న అంశాలు, సిలబస్ గురించి ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపీ సేవలను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు.
News August 25, 2025
KNR: ‘విద్యార్థులు 100 శాతం హాజరు ఉండాలి’

మానకొండూర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం మంది విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని అన్నారు. పాఠశాల బాలికలు తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించి అభినందించారు. అనంతరం 8వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
News August 25, 2025
జమ్మికుంట: మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా జరిగింది.