News July 19, 2024

సౌతాఫ్రికా టీ20 లీగ్‌: ముంబై ఇండియన్స్‌లోకి స్టోక్స్?

image

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరఫున ఆయన బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రూ.8.5 కోట్లు వెచ్చించి అతడిని ఎంఐ ఫ్రాంఛైజీ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు జో రూట్ కూడా పార్ల్ రాయల్స్ తరఫున SA20 2025 ఆడనున్నట్లు టాక్.

Similar News

News January 14, 2025

రాహుల్ గాంధీ పోరాటం అందుకే: కేజ్రీవాల్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చి తనను చాలా సార్లు తిట్టారని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తానెప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. రాహుల్ కాంగ్రెస్‌ను రక్షించడానికి పోరాడితే తాను మాత్రం దేశం కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మరోవైపు ఢిల్లీని పారిస్‌గా మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ కాలుష్యంతో ఎవరూ నగరంలో తిరగకుండా చేశారని రాహుల్ సెటైర్లు వేశారు.

News January 14, 2025

ఉత్తరాయణంలోకి సూర్యుడు

image

సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాగా ఈ పండుగ అన్నింటిలోకెల్లా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

News January 14, 2025

నేటి నుంచి ఇండియన్ ఓపెన్

image

నేటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. పెళ్లి తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నీ ఇదే. అంతకుముందు గత ఏడాది ఆమె SMAT ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచారు. సింధు తొలి రౌండ్‌లో చైనీస్ తైపీ ప్లేయర్ యువోయున్‌తో తలపడనున్నారు. మరోవైపు డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ ఫేవరెట్లుగా ఉన్నారు.