News July 19, 2024
NZB: హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల పరిసరాలతో పాటు కిచెన్లలో ఆహార పదార్థాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని, నిర్వహణ సరిగ్గాలేని హోటళ్లకు జరిమానాలు విధించారు. హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.15వేలు, కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.
News January 16, 2026
UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.
News January 16, 2026
నిజామాబాద్: ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగుల జోరు

నిజామాబాద్ లో సంక్రాంతి సందర్భంగా ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగులు సందడి చేశాయి. ప్రత్యేకంగా ఈ కైట్లు ఎగురవేసేందుకు పిల్లలు యువత ఆసక్తి చూపించారు. ఎటు చూసినా ఆపరేషన్ సిందూర్ కైట్‌లే కనిపించాయి. మోదీ భద్రత దళాలతో ఉన్న ఫోటో కైట్ పై ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సిందూర్, పుష్ప రెండు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇపుడు సంక్రాంతి కైట్‌లలో కూడా పాపులర్ అయ్యాయి.


