News July 19, 2024

రేపు తూ.గో, కోనసీమ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా శనివారం తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ప్రశాంతి, మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాధారణంగా సెలవు కావడంతో వర్షాల తీవ్రతను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Similar News

News September 15, 2024

దేవీపట్నం: అనారోగ్యంతో పాఠశాల హెచ్ఎం మృతి

image

దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీపీ యూపీ పాఠశాల హెడ్ మాస్టర్ కొమరం ధర్మన్న దొర (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కిడ్నీ, షుగర్ వ్యాధులతో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. స్వగ్రామం పాముగండి గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 15, 2024

దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.

News September 15, 2024

ఉప్పాడ సముద్రంలో అద్భుత దృశ్యం (PHOTO)

image

పిఠాపురం మండల పరిధిలోని ఉప్పాడ సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతంలో శనివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎరుపు రంగులో ఉన్న వరద నీరు భారీగా సముద్రంలో కలుస్తున్న వేళ ఒకవైపు నీలివర్ణం, మరోవైపు ఎరుపు వర్ణంతో కూడిన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నా చెల్లెళ్ల గట్టుగా పిలిచే ఈ ప్రాంతంలో వరద నీరు వస్తున్నన్నీ రోజులు ఇదే విధంగా ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.