News July 19, 2024

APPLY: బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్స్

image

AP, TGలోని బీడీ కార్మికులు, మైనింగ్ వర్కర్ల పిల్లలు కేంద్ర కార్మిక శాఖ నేషనల్ స్కాలర్‌షిప్స్ కోసం scholarships.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 1-10 విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, 11వ తరగతి నుంచి డిగ్రీ వరకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ వస్తాయి. ప్రీమెట్రిక్ కోసం AUG 31, పోస్ట్ మెట్రిక్ కోసం OCT 31లోపు అప్లై చేసుకోవాలి. హెల్ప్ లైన్ నం. 0120-6619540, 040-29561297.

Similar News

News January 14, 2026

ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

News January 14, 2026

గంజితో ఎన్నో లాభాలు

image

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

News January 14, 2026

ముగ్గుల్లో వైద్య, కంప్యూటర్ శాస్త్రాల మేళవింపు

image

ముగ్గులలో వైద్యశాస్త్ర సంకేతాలు ఉన్నాయట. కిందికి, పైకి ఉండే త్రిభుజాలు స్త్రీ, పురుష తత్వాలను సూచిస్తాయట. వీటి కలయికతో ఏర్పడే 6 కోణాల నక్షత్రం సృష్టికి సంకేతం. ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆల్గారిథమ్స్ రూపొందించడానికి, క్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి కూడా ముగ్గులు తోడ్పడుతున్నాయట. గణితం, మానవ శాస్త్రం కలగలిసిన అద్భుత కళాఖండం ఈ రంగవల్లిక. ఇది మన సంస్కృతిలోని విజ్ఞానానికి నిదర్శనం.