News July 19, 2024
మెదక్ కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన, ప్రజా విధానం అంశంపై బంగ్లాదేశ్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్స్, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు రాహుల్ రాజ్‌ను అభినందించారు.
Similar News
News August 23, 2025
మెదక్: జిల్లా స్థాయి TLM వాయిదా..!

మెదక్ జిల్లాలోని ఈ నెల 25న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ షెడ్యూల్ నిర్వహణ ఉండడం వల్ల జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ (TLM) మేళాను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. మేళా కొత్త తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని డీఈవో సూచించారు.
News August 23, 2025
మెదక్: NMMS రిజిస్ట్రేషన్.. ఈనెల 30తో ముగింపు

NMMS స్కాలర్‌షిప్ ఎంపికైన విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఆగస్టు 30తో ముగియనుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఇంకా NSP పోర్టల్‌లో నమోదు చేయని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. ప్రీ-ఎన్రోల్ అభ్యర్థులను ప్రధానోపాధ్యాయులు, ఐఎన్‌ఓలు అర్హత నిబంధనల ప్రకారం ఆథరైజ్ చేయాలని కోరారు. గడువు దాటితే స్కాలర్‌షిప్ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
News August 23, 2025
మెదక్ జిల్లాలో 23 మంది కొత్త గెజిటెడ్ HMల నియామకం

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతిలో భాగంగా మెదక్ జిల్లాకు 23 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అలాట్ అయ్యారు. ఇందులో శుక్రవారం 22 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లాల వారీగా మెదక్-9, ఖమ్మం-6, సిద్దిపేట -4, హన్మకొండ-2, కొత్తగూడెం, కామారెడ్డి ఒక్కొక్కరు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి సర్ధన హై స్కూల్ పోస్టింగ్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు జాయిన్ కాలేదు. 15 రోజుల సమయం ఉంది.