News July 19, 2024

నిజామాబాద్: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

నగరంలోని లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సీఐ నరహరి, మహిళా సీఐ శ్రీలత, నాలుగవటౌన్ ఎస్ఐ పాండేరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 20, 2025

NZB: మొదలైన కదలిక..!

image

నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో కదలిక మొదలయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2BHK కోసం అర్హులను ఎంపిక చేసేందుకు విచారణ జరుపుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 19,397 ఇండ్లు లక్ష్యానికి 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 9,486 మార్కింగ్ పూర్తి అయ్యాయి. ఇందులో NZB (U) 900, NZB (R) 502, బాల్కొండ 1176, బోధన్ 1553, బాన్సువాడ 4807, ఆర్మూర్ 548 ఇండ్లు ఉన్నాయి.

News August 20, 2025

NZB: ‘5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ’

image

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా జిల్లాకు 67,529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇందులో మంగళవారం వరకు 62,254 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు. 5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత 2024 వానాకాలం సీజన్లో జిల్లాలో 68,244.8 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు.

News August 20, 2025

నిజామాబాద్: కబడ్డీ జట్టు చీఫ్ కోచ్‌గా ప్రశాంత్

image

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు హైదరాబాద్‌లో యువ తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ లీగ్ కోసం రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ ‘శాతవాహన సైనిక’ జట్టుకు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కబడ్డీ కోచ్‌గా పని చేస్తున్నారు.