News July 19, 2024
నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ

మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.
Similar News
News August 20, 2025
NLG: బియ్యంతో పాటు ఇక సంచులు

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇకపై బియ్యంతో పాటు పర్యావరణహిత సంచులను అందించనుంది. జిల్లాలోని 4.66 లక్షల కార్డులకు ఈ సంచులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల బియ్యం కోటాతో పాటు వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. కార్డుల వారీగా సంచులను ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ బ్యాగుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యమైన సంచులను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
News August 20, 2025
జిల్లాలో 143.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం 143.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 15.4మి.మీ. వర్షం కురివగా నార్కట్ పల్లిలో 12.1, కట్టంగూర్ 10.4, శాలిగౌరారం 11.5, నకిరేకల్ 14.2, కేతేపల్లి10.9, తిప్పర్తి 4.4, నల్గొండ 6.3, కనగల్ 4.1, అనుముల 2.6, నిడమనూరు 1.1, త్రిపురారం 2.3, వేముల పల్లి 3.3, మిర్యాలగూడ 1.3, తిరుమలగిరి1.7, పెద్ద వూర 1.4, చింతపల్లి 3.2, గుర్రంపోడు లో 3.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News August 20, 2025
అందరి సహకారంతో మాదకద్రవ్యాల నిర్మూలన: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.