News July 19, 2024
రైతుల సూచనలతో రైతు భరోసాపై నిర్ణయం: మంత్రి తుమ్మల

తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలోని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News August 20, 2025
కరీంనగర్: వివాహిత అనుమానాస్పద మృతి

కరీంనగర్ భగత్ నగర్లో భావన(మానస) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన భర్త జ్ఞానేశ్వర్ అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్దామని ఆమెను కిందికి దించుతుండగా, అప్పటికే మృతి చెందిందని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News August 20, 2025
KNR: జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లం బోధించే టీచర్లు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ పమెలా సత్పతి KNR కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో అన్నారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకచర్యల గురించి సమావేశం ఏర్పాటుచేశారు. పిల్లలతో ప్రతిరోజు ఓ పేజీ రాయించాలని 2పేజీలు చదివించాలని, అలాగే PHCలో ప్రసవాలసంఖ్యను పెంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
KNR: సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

SRR ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న క్యాండిల్ మేకింగ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సర్టిఫికేట్ కోర్సులు ప్రాక్టికల్ నైపుణ్యాలు, సృజనాత్మకత అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రూపొందించబడిందన్నారు.