News July 20, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి: కలెక్టర్ క్రాంతి

image

అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News August 23, 2025

మెదక్: NMMS రిజిస్ట్రేషన్‌.. ఈనెల 30తో ముగింపు

image

NMMS స్కాలర్‌షిప్‌ ఎంపికైన విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 30తో ముగియనుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్‌ తెలిపారు. ఇంకా NSP పోర్టల్‌లో నమోదు చేయని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. ప్రీ-ఎన్రోల్‌ అభ్యర్థులను ప్రధానోపాధ్యాయులు, ఐఎన్‌ఓలు అర్హత నిబంధనల ప్రకారం ఆథరైజ్‌ చేయాలని కోరారు. గడువు దాటితే స్కాలర్‌షిప్‌ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

News August 23, 2025

మెదక్ జిల్లాలో 23 మంది కొత్త గెజిటెడ్ HMల నియామకం

image

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతిలో భాగంగా మెదక్ జిల్లాకు 23 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అలాట్ అయ్యారు. ఇందులో శుక్రవారం 22 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లాల వారీగా మెదక్-9, ఖమ్మం-6, సిద్దిపేట -4, హన్మకొండ-2, కొత్తగూడెం, కామారెడ్డి ఒక్కొక్కరు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి సర్ధన హై స్కూల్ పోస్టింగ్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు జాయిన్ కాలేదు. 15 రోజుల సమయం ఉంది.

News August 23, 2025

మెదక్: పాఠశాలకు టెన్త్ మెమోలు

image

మార్చి, జూన్ 2025లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లు లాంగ్ మెమోలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సర్టిఫికెట్లు అందిన విషయాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ధారించి, సంబంధిత MEOలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సర్టిఫికెట్లు రాకపోతే వెంటనే వివరాలు ACGEకి పంపాలని ఆదేశించారు.