News July 20, 2024

వర్షా కాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

image

వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. డీఆర్డీఓ, డీపీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు.

Similar News

News August 23, 2025

వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్‌కు స్థానచలనం

image

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న వరంగల్ డీఈవో మామిడి జ్ఞానేశ్వర్‌ను నిర్మల్ జిల్లా FAC FAOగా పంపిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్ శఉక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానేశ్వర్‌పై వివిధ ఉపాధ్యాయ సంఘాలు 21 ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

News August 22, 2025

వరంగల్: మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి’పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్స్‌, కమిటీ ఛైర్మన్‌లను ఆదేశించారు.

News August 22, 2025

రేపటి నుంచి ప్రభుత్వ జూ.కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో ఈనెల 23 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) హజరు పద్దతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రిన్సిపళ్లకు, సంబంధిత ఇన్‌ఛార్జ్‌లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రోజువారీ హాజరు నమోదు చేయాలన్నారు.