News July 20, 2024

హింసాత్మక ఘటనలు.. బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ

image

బంగ్లాదేశ్‌లో హింసాత్మక <<13658840>>ఘటనలు<<>> చోటుచేసుకోవడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సవరించాలని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం మిలిటరీని మోహరించింది.

Similar News

News January 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మ.3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉ.11 గం.కు విడుదల చేయనున్నారు. దళారులను నమ్మవద్దని <>ttdevasthanams.ap.gov.in/<<>> లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని TTD సూచించింది.

News January 23, 2025

మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

image

చదువును కొందరు బిజినెస్‌గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్‌లో మూడో తరగతి ఫీజు షాక్‌కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News January 23, 2025

ఆస్కార్ నామినీల ప్రకటన.. లిస్ట్‌లో హిందీ మూవీ

image

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటితో పాటు పలు విభాగాల్లో నామినీలను ప్రకటించారు. వీటిలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. అవార్డు విజేతలను భారత కాలమానం ప్రకారం మార్చి 3న ప్రకటించనున్నారు.