News July 20, 2024

అలా అయితే జగన్‌పైనా కేసు పెట్టాలి కదా: మంత్రి

image

AP: రషీద్ హత్య కేసుపై YS జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యప్రసాద్ కౌంటరిచ్చారు. ‘నిందితుడు TDP నేతలతో దిగిన ఫొటోలు ఉన్నాయని, వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ అన్నారు. అలా అయితే YCP హయాంలో జరిగిన అత్యాచార నిందితుల్లో సగం మంది జగన్‌తో సెల్ఫీలు దిగారు. వాళ్లతో పాటు జగన్‌పై కూడా రేప్ కేసులు పెట్టాలి కదా? రౌడీషీటర్ PS ఖాన్ అనుచరుడే హంతకుడు జిలానీ. ఆ ఖాన్‌తో కలిసే జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు’ అని అన్నారు.

Similar News

News January 23, 2025

మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

image

చదువును కొందరు బిజినెస్‌గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్‌లో మూడో తరగతి ఫీజు షాక్‌కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News January 23, 2025

ఆస్కార్ నామినీల ప్రకటన.. లిస్ట్‌లో హిందీ మూవీ

image

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటితో పాటు పలు విభాగాల్లో నామినీలను ప్రకటించారు. వీటిలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. అవార్డు విజేతలను భారత కాలమానం ప్రకారం మార్చి 3న ప్రకటించనున్నారు.

News January 23, 2025

సరుకుతో పాటు ప్రయాణికులతో వెళ్లే రైళ్లు

image

ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఫ్రైట్ కమ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కింది అంతస్తులో సరుకు, పైన ప్రయాణికులు వెళ్లేలా డబుల్ డెక్కర్ లాంటి రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్డు రవాణాతో పోటీ పడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.