News July 20, 2024
త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా: కేటీఆర్

TG: తాను త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారింది. లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది’ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన డ్రోన్ <<13665123>>వీడియోపై<<>> ఆయన ఈ విధంగా స్పందించారు.
Similar News
News July 4, 2025
పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
News July 4, 2025
గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
News July 4, 2025
అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.