News July 20, 2024
ANU పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద పీజీ కోర్సులలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. MA, Mcom Msc, MA (జర్నలజం- మాస్ కమ్యూనికేషన్),MPA, MLISC , MED, MPED కోర్సులలో చేరేందుకు ఈనెల 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చని సంచాలకులు అనిత తెలిపారు.
Similar News
News September 17, 2025
తురకపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటన

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.
News September 17, 2025
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ రత్న షీలామణి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.
News September 16, 2025
మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.