News July 20, 2024
ఖమ్మం: రైతన్నలకు రుణమాఫీలు అయోమయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆధారంగా ఖాతాల్లో నగదు జమ అయిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. అందని వారిలో అయోమయం నెలకొంది. జాబితాలో పేర్లు లేవని గుర్తించిన పలువురు పీఏసీఎస్, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం కానరావడం లేదు. మాఫీ నిబంధనలు, ప్రక్రియ గందరగోళంగా ఉండడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తిున్నారు.
Similar News
News August 22, 2025
‘భూమిచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు: Dy.Cm

విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 320 మందికి నియామక పత్రాలు అందజేశారు. ‘ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే.. ఇవాళ మీకు ఉద్యోగాలు ఇస్తోంది మా ప్రభుత్వమే. 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది. ఆ చట్టంతోనే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నాం’ అని భట్టి పేర్కొన్నారు.
News August 22, 2025
ఫేక్ ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవు: ఖమ్మం సీపీ

ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఓ దిన పత్రికకు అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్ చేసి తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 22, 2025
విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం DMHO

సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కళావతి బాయి సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.