News July 20, 2024
రైతు రుణమాఫీ డబ్బులు రాలేదని ఫిర్యాదులు

TG: రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయుల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ.లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మీకు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.
Similar News
News November 10, 2025
వారంతా మూర్ఖులు: ట్రంప్

తన పాలసీ టారిఫ్‌లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్‌ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్‌కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.
News November 10, 2025
శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.
News November 10, 2025
శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.


