News July 20, 2024

HYDలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి

image

HYDలోని దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న NZB జిల్లాకు చెందిన ఆశ్మిత్, జస్వంత్, నవనీత్ మరో స్నేహితుడు హరితో కలిసి శుక్రవారం సాయంత్రం టీ తాగేందుకు కారులో వెళ్లారు. దుండిగల్ ఎగ్జిట్ నం.5 వద్ద బౌరంపేట-గండిమైసమ్మ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొంది. దీంతో అక్షయ్, అశ్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందినట్లు CI శంకరయ్య తెలిపారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 13, 2026

నవీపేట్: గొంతుకోసిన చైనా మాంజా

image

చైనా మాంజా ఒక రైతు ప్రాణం మీదకు తెచ్చింది. నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన మణికాంత్ పొలం నుంచి గడ్డితో బైక్‌పై వస్తుండగా, చైనా మాంజా మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. నిషేధిత మాంజా వాడకం వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News January 13, 2026

నిజామాబాద్: రెండు బైక్‌లు ఢీ

image

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని వేల్పూర్ ఎక్స్‌ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌కు చెందిన గంగారాం,ఎల్లయ్య గాయపడగా,108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News January 13, 2026

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ సమీక్ష

image

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సిపి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.