News July 20, 2024

NGKL: మద్యం తాగించి మహిళ కూలీలపై అత్యాచారం

image

ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన NGKL జిల్లా అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. బల్మూర్ మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ పనికి వచ్చారు. బండల వ్యాపారం నిర్వహించే వినోద్ సింగ్, గజానంద్ అనే వ్యక్తులు ఇద్దరు మహిళలను కూలీ పనికి తీసుకెళ్లారు. వారిని కారులో ఎక్కించుకొని మద్యం తాగించి అత్యాచారం చేశారు. కేసు నమోదైంది.

Similar News

News December 30, 2024

వనపర్తి: ‘లిఫ్ట్ ఇరిగేషన్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు విడుదల’

image

కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విద్యుత్‌ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News December 30, 2024

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల జిల్లా యువకుడు

image

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.

News December 30, 2024

మహబూబ్‌నగర్‌: డిగ్రీ విద్యార్థిని సూసైడ్

image

ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలం కాకర్లపహాడ్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంకిత(18) మహబూబ్‌నగర్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆలయంలో పని చేస్తుంటారు. కాగా, ఆదివారం వారు గుడికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అంకిత ఇంట్లో ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.