News July 20, 2024

సింహాచలం: రేపు దిల్లీ విజయోత్సవం

image

ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News December 22, 2024

విశాఖ జిల్లాలో హైటెక్ హరిదాసు

image

విశాఖ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హరిదాసులు, బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అయితే కాలానుగుణంగా హరిదాసులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు కాలినడకన తంబుర పట్టుకుని వీధివీధి తిరిగేవారు. అయితే మర్రిపాలెం గ్రామంలో టూవీలర్ల పై హరిదాసులు తిరుగుతూ సందడి చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు ఆనాటి కళకనిపించడం లేదని అంటున్నారు.

News December 22, 2024

మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

image

పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎం.పి.పి. స్కూల్‌ను అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బల్లగరువులో సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ దారిలో ఉన్న కొర్రపత్తి స్కూల్‌కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడగా వారు సమస్యను వివరించారు. అలాగే అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ, ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.

News December 22, 2024

రైవాడ అందాలను ‘క్లిక్’మనిపించిన పవన్ కళ్యాణ్

image

రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు – కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.