News July 20, 2024
UPSC ఛైర్మన్ రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవీకాలం 2029తో ముగియనుండగా ఐదేళ్ల ముందుగానే తప్పుకున్నారు. కొందరు అభ్యర్థులు యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం, ఈ క్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 31, 2025
థాంక్యూ జగన్ గారు: అల్లు అర్జున్

AP: అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించడం పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ X వేదికగా సంతాపం తెలిపారు. ‘కనకరత్నమ్మ గారు మృతిచెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. ‘థాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు చాలా సంతోషం’ అని కామెంట్ చేశారు.
News August 31, 2025
ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

TG: అత్యవసరంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కాళేశ్వరం నివేదిక, BC రిజర్వేషన్ల కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం వంటి రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, BC రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మల్చుకునేలా అధికార పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టాలని BRS భావిస్తోంది.
News August 31, 2025
ఫ్రీ బస్సు.. మరో శుభవార్త

AP: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా అనుమతించాలని ప్రభుత్వం RTCని ఆదేశించింది. కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో నడిచే బస్సులకు ఆయా బస్టాండ్‌లలోనే టికెట్లు ఇస్తుంటారు. ఇలాంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో ఇకపై మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. అలాగే సింహాచలం కొండతో సహా 39 ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ ఈ స్కీం అమలుకు ఆదేశాలిచ్చారు.