News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

Similar News

News August 22, 2025

HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

image

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.

News August 22, 2025

HYD: గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా? ఇవి కంపల్సరీ

image

గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌‌కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్‌కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.

News August 22, 2025

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

image

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 ఎజెండా అంశాలు, 7 టేబుల్ అంశాలకు ఆమోదం లభించింది. ముందుగా రామంతాపూర్ కృష్ణాష్టమి విషాదంలో బాధితులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వెండింగ్ షాపుల టెండర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడీ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ నిర్ణయాలతో నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.